Skip to main content

Namaste NRI

హ్యూస్టన్ మెట్రో చైర్మన్ గా భారతీయ అమెరికన్

భారతీయ అమెరికన్‌ ఇంజనీర్‌ సంజయ్‌ రామభద్రన్‌ హ్యూస్టన్‌ మెట్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ప్రధాన ప్రజా రవాణా సంస్థకు నాయకత్వం వహించబోతున్న మొదటి భారతీయ అమెరికన్‌ వ్యక్తిగా సంజయ్‌ నిలిచారు. బిట్స్‌ పిలానీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సంజయ్‌ ఆ తరువాత టెక్సాస్‌ ఏఎం విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. 2015 నుండి మెట్రో బోర్డులో పని చేస్తున్నారు. ప్రస్తుతం క్యాపిటల్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఫైనాన్స్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ  సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు.  ఇంతకుముందు ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హ్యూస్టన్‌ (ఐఏసీసీజీహెచ్‌) అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News