Skip to main content

Namaste NRI

భారత్ సాయం కోరిన ఉక్రెయిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నంత పని చేశారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన కొద్దిసేపట్లోనే సైన్యం దాడులకు దిగింది. రాజధాని కీవ్‌తో సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. రష్యా దాడులతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించగలదని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఢల్లీి తమకు అండగా ఉండాలని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలిఖా కోరారు. రష్యా`ఉక్రెయిన్‌ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ప్రధాని మోదీ తక్షణమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌ స్కీలతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.

Social Share Spread Message

Latest News