రష్యా, ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో భారతీయ విద్యార్థులంతా కీవ్ నగరాన్ని వీడాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం మరోసారి అడ్వైజరీని జారీ చేసింది. ఉక్రెయిన్‌ను వీడేందుకు రైళ్లు, బస్సులు, ఇతర మార్గాలను వినియోగించుకోవాలని సూచించింది. రష్యా సైన్యం 2 4 గంటల్లో కైవ్ నగరంపై వేగంగా దాడి చేసే అవకాశం ఉందని అన్నారు. భారతీయ పౌరులు, విద్యార్థులంతా ముందస్తుగానే నగరం విడిచి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు పేర్కొంది.














