Skip to main content

Namaste NRI

భారతీయ విద్యార్థులంతా కీవ్‌ ను వీడాలి

రష్యా, ఉక్రెయిన్‌ యుద్దం నేపథ్యంలో భారతీయ విద్యార్థులంతా కీవ్‌ నగరాన్ని వీడాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం మరోసారి అడ్వైజరీని జారీ చేసింది.  ఉక్రెయిన్‌ను వీడేందుకు రైళ్లు, బస్సులు, ఇతర మార్గాలను వినియోగించుకోవాలని సూచించింది. రష్యా సైన్యం 2 4 గంటల్లో కైవ్‌ నగరంపై వేగంగా దాడి చేసే అవకాశం ఉందని అన్నారు. భారతీయ పౌరులు, విద్యార్థులంతా ముందస్తుగానే నగరం విడిచి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు పేర్కొంది.

Social Share Spread Message

Latest News