Skip to main content

Namaste NRI

అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త.. ఈనెల 27 నుంచి

అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా నిషేధం విధించిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన టీకా కవరేజీని గుర్తించి, సంప్రదింపుల అనంతరం ఈ నెల 27 నుంచి వాణిజ్య, అంతర్జాతీయ ప్రయాణ సర్వీసుల సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 2020 మే నుంచి వందేభారత్‌ విషన్‌, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా కొన్ని విమానాలు నడుస్తున్నాయి. అమెరికా, యూకే, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలతో భారత్‌ ఈ తరహా ఒప్పందం చేసుకుంది.

Social Share Spread Message

Latest News