అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఏజెంట్. దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తుండగా, సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో అఖిల్ మెషిన్ గన్ పట్టుకొని పవర్‌పుల్ లుక్‌లో కనిపించారు. దీనికి ది వైల్డ్ వన్ అంటూ చిత్ర బృందం ఓ వ్యాఖ్యను జోడిరచింది. ఈ చిత్రంలో యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో అఖిల్ కనిపిస్తారు. అఖిల్‌లో కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. మమ్ముట్టీని ఓ పవర్‌పుల్ ఆఫీసర్ పాత్రలో చూస్తారు అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏజెంట్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడిరచారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారు. ఈ సినిమాకు సంగీతం: హిప్ హాప్ తమిళ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :కిశోర్ గరికిపాటి.














