Namaste NRI

పోలాండ్‌ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐరోపా పర్యటన చేపట్టనున్నారు. నాటో, ఐరోపా మిత్ర దేశాలతో అత్యవసర సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బైడెన్‌ మొదట బ్రస్సెల్స్‌ చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌తో భేటీ కానున్నారు. రష్యా భీకర దాడులతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా, దాని మిత్ర దేశాలు అందిస్తున్న మానవతా సాయం గురించి చర్చించనున్నారు. అయితే ఉక్రెయిన్‌ సందర్శించే ఆలోచన బైడెన్‌కు లేదని శ్వేతసౌధం వర్గాలు ఇప్పటికే వెల్లడిరచాయి. ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు నెలరోజులు కావస్తున్న నేపథ్యంలో బైడెన్‌ ఈ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఉక్రెయిన్‌కు భద్రతాపరంగా, మానవత పరంగా ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని అమెరికా స్పష్టం చేసింది. అంతకు ముందు ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం అందజేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events