సుధీర్‌బాబు హీరోగా వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఈ చిత్రానికి మహేష్ దర్శకుడు. వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాం. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో సుధీర్‌బాబు పవర్‌పుల్ పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నారు అని చెప్పారు. భరత్, గోపరాజు రమణ, జెమినీ సురేష్, మైమ్ గోపీ, అజయ్త్నం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : అరుల్ విన్సెంట్, ఆర్ట్: వివేక్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, దర్శకత్వం: మహేష్.














