Skip to main content

Namaste NRI

రష్యా విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌  ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత రష్యా మంత్రి భారత్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.  రెండు రోజులు సెర్జీవ్‌ దేశంలోని కీలక నేతలు, విదేశాంగ శాఖ ప్రతినిధులతో సమావేశమవుతారని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ప్రస్తుత యుద్ధం, ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భవిష్యత్‌ వ్యూహాలపై చర్చిస్తారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు రష్యాను ఇబ్బంది పెడుతున్న తరుణంలో భారత్‌ నుంచి రష్యాకు మరింత సహకారం అందాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News