రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారం ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ప్రస్తుతం ఐరోపాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ఈ సందర్భంగా కూటమి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. మన ప్రాంతం ఆరోగ్య, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకుని నిలిచేందుకు ఐక్యత, సహకారం అవసరం అని మోదీ అన్నారు. అలాగే ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య కోసం అంగీకారానికి రావాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. బంగాళాఖాతం ప్రాతం అనుసంధానత, భద్రతకు వారధిగా మారే సమయం ఆసన్నమైంది అని ప్రధాని అన్నారు.














