Namaste NRI

ఈ నెల 21న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం

ఈ నెల 21న సిక్కు గురువు తేజ్‌ బహుదూర్‌ 400వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. తేజ్‌గురు స్మారకనాణెం, పోస్టల్‌ స్టాంప్‌ను కూడా ప్రధాని విడుదల చేస్తారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మీడియా సమాశంలో తెలిపారు. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షా కూడా హాజరవుతారు.  ఏప్రిల్‌ 20న అమిత్‌ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఢల్లీి సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ భాగస్వామ్యంతో సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఈ కార్యరకమాన్ని నిర్వహిస్తుంది.  ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉపఖండం , విదేశాల నుంచి కూడా ప్రముఖ వ్యక్తులు పాల్గొంటారని సాంస్కృతిక శాఖ పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events