Namaste NRI

మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి : అశోక్‌ గౌడ్‌

ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ దూసరి అన్నారు. రంజాన్‌ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు.  ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ హిందు, ముస్లింల మత సామరస్యానికి రంజాన్‌ దీక్షలు ప్రతీక అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయంగా, సామాజికంగా అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. మైనారిటీల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు.   ముస్లిం నాయకుడు సయీద్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ముస్లింలు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు.  కేసీఆర్‌ నాయకత్వంలోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమన్నారు.

                ఈ కార్యక్రమంలో టాక్‌ అధ్యక్షుడు, యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌ కడుదుల, ఉపాధ్యక్షుడు నవీన్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు రమేష్‌ ఇస్సంపల్లి, మల్లారెడ్డి, ఈస్ట్‌ లండన్‌ ఇంచార్జి ప్రశాంత్‌ కటికనేని, మధు ఆబోతు, అధికార ప్రతినిధులు రవి కుమార్‌ రేతినేని, రవీ ప్రదీప్‌ పులుసు, లండన్‌ ఇంచార్జి నవీన్‌ భువనగిరి, నవీన్‌ మాదిరెడ్డి,  ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి, గణేష్‌, షా సాబ్‌, ఆదిల్‌, ఫయాజ్‌ ఫైసల్‌ ఖాన్‌ నవాజ్‌, మసూద్‌, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events