శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగిన అల్లుర్లు, తీవ్ర పర్యవసనాల నేపథ్యంలో ప్రజా ఆస్తులకు నష్టం లేదా ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్న వ్యక్తులను కాల్చిపడేయాలని త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శ్రీలంక రక్షణమంత్రిత్వ శాఖ ప్రతినిధి నలిన్ హెరాత్ ప్రకటించారు. మరోవైపు తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో వారెంట్ లేకుండానే వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు మిలటరీ, పోలీసులకు ఆ దేశం ఎమర్జెన్సీ అధికారులు అప్పగించింది. తీవ్రమైన అల్లర్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న శ్రీలంకను కొత్త ప్రభుత్వం నడిపించాలని నిరసనకారులతోపాటు కీలకమైన వాణిజ్య గ్రూపులు కూడా కోరుతున్నాయి. అల్లర్లలో ఇప్పటికే 8 మందికి పైగా చనిపోగా, 200లకు పైగా మంది గాయపడ్డారు.














