తెలంగాణ యువ బాక్సర్ నిఖిత్ జరీస్ మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఈ ఏడాది స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో బంగారు పతకం సాధించిన నిఖిత్, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన కారోలైన్ డి అల్మెడపై 5`0 తేడాతో విజయం సాధించింది. కచ్చితంగా రజతం ఖాయమైనప్పటికీ బంగారు పతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఛాంపియన్ షిప్లో భారత్ తరపున మేరికోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ సి మాత్రమే టైటిల్‌ను నెగ్గారు. ఇప్పుడు నిఖిత్ గెలిస్తే వారి సరసన చేరుతుంది. 2022లో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణీగా జరీన్ నిలిచింది.














