Namaste NRI

సెన్సార్‌ పూర్తి చేసుకున్న విక్రమ్‌

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విక్రమ్‌. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సూర్య అతిథి పాత్రను పోషిస్తున్నారు.  ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ. సర్టిఫికేట్‌ లభించింది. నితిన్‌ తండ్రి, నిర్మాత సుధాకర్‌ రెడ్డి చెన్నైలో కమల్‌హాసన్‌ను కలిశారు. విక్రమ్‌ చిత్ర తెలుగు పోస్టర్‌ను కమల్‌హాసన్‌కు అందించారు. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ అండర్‌కవర్‌ పోలీస్‌ పాత్రలో కనిపిస్తారని, అసాంఘిక శక్తుల ఆట్టకట్టించేందుకు ఆయన అనుసరించే వ్యూహాలు ఉత్కంఠంను పంచుతాయని చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400కు పైగా థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నామని నిర్మాత సుధాకర్‌ రెడ్డి తెలిపారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హీరో నితిన్‌ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్‌ మూవీస్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. ఫహద్‌ ఫాజిల్‌, కాళిదాస్‌ జయరామ్‌, నరేన్‌, అర్జుణ్‌దాస్‌, శివాని నారాయణన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, నిర్మాణ సంస్థ: రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events