Namaste NRI

చరిత్ర సృష్టించిన గీతాంజలి

ప్రముఖ హిందీ నవలా రచయిత గీతాంజలి ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ని గెలుచుకుని చరిత్రని సృష్టించారు. సాహిత్యంలో అత్యుత్తమ నవలను ఎంపిక చేసి ఈ ప్రైజ్‌ ని ఏటా ప్రకటిస్తుంటారు. టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను ఈ ఏడాదికి గాను బుకర్‌  ప్రైజ్‌ వరించింది.  భారతీయ భాషలలో అవార్డు గెలుచుకున్న మొదటి పుస్తకంగా ఇది రికార్డు నమోదు చేసింది. ఈ హిందీ నవలను ఇంగ్లిష్‌ లోకి అనువదించిన అమెరికా ట్రాన్స్‌ లేటర్‌ డైసీ రాక్‌ వెల్‌ తో సంయుక్తంగా బుకర్‌ ప్రైజ్‌ ను గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు.  టూండ్‌ ఆఫ్‌ శాండ్‌ పుస్తకాన్ని బలమైన వాదాన్ని వినిపించే ఎదురేలేని నవలగా అవార్డు న్యాయ నిర్ణేతలు అభివర్ణించారు.  అవార్డుతో పాటు 50,000 పౌండ్లను విజేతలకు అందిస్తారు.      ఉత్తరప్రదేశ్‌  మెయిన్‌ పురిలో జన్మించిన, ఢల్లీిలో పెరిగిన గీతాంజలిశ్రీ (64) మూడు నవలలు, పలు కథలను ఇప్పటి రాశారు.  బ్రిటన్‌ లో పబ్లిక్‌ అవుతున్న ఆమె తొలి పుస్తకం టూండ్‌ ఆఫ్‌ శాండ్‌. 2000లో మాయ్‌ అనే పుస్తకం రాయగా, ఇది క్రాస్‌ వర్డ్‌ బుక్‌ అవార్డుకు ఎంపికైంది. గతంలో పలు అవార్డులు సైతం ఆమెను వరించాయి. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events