తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా జాతి రత్నలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రధారి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్‌పై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్కె 20 వర్కింగ్ టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయింది. వినాయక చవితి సందర్బంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది అన్నారు సురేష్ బాబు. భారత్‌లోని పుదుచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంగా సాగే కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందిందీ సినిమా. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సహ నిర్మాత: అరుణ్ విశ్వ.














