Skip to main content

Namaste NRI

అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ

అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతుననది. టెక్సాస్‌ ఘటన మరువక ముందే మరోసారి ఓ ఉన్మాది తుపాకీతో చెలరేగిపోయాడు. ఓక్లహామాలోని తుల్సా నగరంలో ఉన్న సెయింట్‌ ఫ్రావ్సిస్‌ దవాఖాన ప్రాంగణంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిని కాల్చిన తర్వాత అతడు కూడా కాల్చుకుని చనిపోయాడని వెల్లడిరచారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. అతడు ఎవరేనిది గుర్తించాల్సి ఉన్నదని తుల్సా పోలీస్‌ డిప్యూటీ చీఫ్‌ జొనాథన్‌ బ్రూక్‌ తెలిపారు.  నిందితుని వద్ద రైఫిల్‌, హ్యాండ్‌గన్‌ ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

Social Share Spread Message

Latest News