అగ్రరాజ్యం అమెరికా తీరగస్తీ దళం నూతన కమాండెండ్‌గా తొలిసారి ఓ మహిళ నియమితురాలై రికార్డు సృష్టించారు. ఇంతవరకు వైస్ కమాండెంట్‌గా ఉన్న లిండా ఫాగన్ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ఇది ఇంతకు ముందే జరిగి ఉండాల్సిందని అన్నారు. మహిళలకు అవకాశమ్విని రంగమంటూ లేదని ఆయన పేర్కొన్నారు. ఫాగన్ ఉద్యోగ ప్రస్తావాన్ని, అవకాశాలను అందిపుచ్చుకున్న తీరు ప్రస్తావించారు. లిండా పాగన్ నియామకాన్ని కొనియాడారు. ఇలాంటి కీలక స్థానాల్లో మరింత మంది మహిళలు రావాల్సి ఉందన్నారు. ప్రపంచం ఈరోజు తీసుకునే నిర్ణయాలు 21 శతాబ్దికి మార్గదర్శనం చేస్తాయని అన్నారు.














