Skip to main content

Namaste NRI

చైనా సంచలన ప్రకటన

చైనా దేశం సంచలన ప్రకటన చేసింది. జాతీయ భద్రతకు పౌరులు సహకరించాల్సిందిగా అభ్యర్థించింది. ఇలా చేస్తే పౌరులకు సుమారు రూ.11 లక్షల రివార్డును, సర్టిపికేట్లను అందజేస్తామని చెప్పింది. జాతీయ భద్రతకు మద్దతిచ్చేలా, భద్రత ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి సమాచారం ఇస్తే పౌరులకు మంచి రివార్డులు అందిస్తామని ప్రకటించింది. నేరాలను నివారించడం లేదా ఏదైనా కేసు పరిష్కరించడంలో సహకరించిన వారికి పెద్ద మొత్తంలో నగదు, సర్టిఫికేట్లు ఇస్తామని తెలిపింది. ఇది ఒక రకంగా జాతీయ భద్రతకు సహకరించేలా పౌరుల్లోని ద్యైర్యాన్ని జ్ఞానాన్ని బలాన్నీ సమీకరించే చర్యగా పేర్కొన్నవచ్చు.  కొన్ని సంవత్సరాలుగా భద్రతా ఉల్లంఘనల గురిచి సమాచారం అందించిన వారికి మంచి నగదు బహుమతులను అందిస్తోంది.

Social Share Spread Message

Latest News