Skip to main content

Namaste NRI

కిరాయి ఫస్ట్‌లుక్‌ విడుదల

త్రిగుణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కిరాయి. వీఆర్‌కే (రామకృష్ణ) దర్శకుడు. అమూల్యా రెడ్డి యలమూరి, నవీన్‌ రెడ్డి ఉయ్యూరు నిర్మాతలు. పాయల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.  త్రిగుణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ  గుంటూరు నేపథ్యంలో 1995, 2003 కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కిరాయి తీసుకోకుండా హీరో ఓ కిరాయి హత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు? ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ చిత్ర  కథ అన్నారు.  నిర్మాత మాట్లాడుతూ హూ ఓల్టేజ్‌ యాక్షన్‌ చిత్రమిది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర.

Social Share Spread Message

Latest News