Skip to main content

Namaste NRI

భారత్‌పై చైనా ప్రశంసలు

భారత్‌పై చైనా ప్రశంసలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్‌ అందిస్తున్న సహాయ సహకారాలను మెచ్చుకున్నది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్‌ మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్‌ చేస్తున్న సహాయ ప్రయత్నాలు ప్రశంసనీయమని అన్నారు. శ్రీలంక విషయంలో భారత ప్రభుత్వం చాలా చేసిందని మేం గమనించాం. ఆ ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. శ్రీలంక, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వీలైనంత తర్వగా కష్టాల నుంచి బయటపడేందుకు సహాయం చేయడానికి భారతదేశం, ఇతర అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది అని అన్నారు.

Social Share Spread Message

Latest News