Namaste NRI

గాడ్సే ఆ లోటును తీర్చేసింది : సి.కల్యాణ్‌

హీరో సత్యదేవ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం గాడ్సే. ఈ చిత్రం  ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎనబై మూడు సినిమాలు తీశాను. గాడ్సే విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నా. నేటి సమాజానికి మంచి సందేశాన్నందించే చిత్రమిది అన్నారు. టి.కృష్ణతో నాకు మంచి అనుబంధం ఉండేంది. ఆయనతో సినిమా చేయలేదనే ఫీలింగ్‌ ఉండేది నాకు. గోపీ గణేష్‌ చేసిన గాడ్సే సినిమా ఆ లోటును తీర్చేసింది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ  మా బ్యానర్‌లో గొప్ప చిత్రమవుతుంది అన్నారు. ఈ దేశంలో అతి కొద్ది మంతి మాత్రమే వారు  చదివిన చదువుకి సరైన అర్హత ఉన్న ఉద్యోగం చేస్తున్నారు. మిగతా వాళ్లు ఏదో సర్దుకుపోతున్నారు. నేడు మనందరి మనసుల్లో నిక్షిప్తమై ఉన్న ప్రశ్నల్ని ఈ గాడ్సే సంధించబోతున్నాడు. ఈ సినిమాలో సామాజిక సమస్యను చర్చించాం అని తెలిపారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ నేటి యువత కోసం చేసిన సినిమా ఇది. చిన్న సమస్యలనుకొని మనం కొన్ని విషయాల పట్ల ఊదాసీనంగా వ్యవహరిస్తాం. కానీ అవే పెద్ద సమస్యలుగా మారుతాయి. అలాంటి అంశాల్ని ఈ సినిమాలో చర్చించా అన్నారు.  గోపీ గణేష్‌ పట్టాభి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాభి, హీరో సత్యదేవ్‌, కె.ఎస్‌.రామారావు, బ్రాహ్మాజీ, అశోక్‌ కుమార్‌, శాండీ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events