బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్నది. కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, చంద్రిక రవి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. నేడు బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌హంట్‌ను (టీజర్) విడుదల చేశారు. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో శక్తివంతంగా కనిపిస్తున్నారు బాలకృష్ణ. నీ జోవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటాలోనే లేదు వంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్, మాస్ అంశాలతో టీజర్‌ను తీర్చిదిద్దారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబి, సంగీతం: తమన్, ఎడిటర్: నవీన్ నూలి, ఫైట్స్ : రామ్‌లక్ష్మణ్, సీఈవో : చెర్రీ, ప్రొడక్షన్ డిజైనర్, ఏఎస్ ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చందు రావిపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.














