Namaste NRI

ఓటమి తట్టుకోలేకే…. ట్రంప్ ఆ దాడి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యాపిటల్‌ హిల్‌పై  దాడికి పన్నాగం వేసినట్లు అమెరికా ప్రజాప్రతినిధుల ప్యానెల్‌ తన విచారణలో తెలిపింది. 2021, జవనరి ఆరో తేదీన క్యాపిటల్‌ హిల్‌పై నిరసనకారులు దాడి చేసి విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే.  క్యాపిటల్‌ హిల్‌ వద్దకు వేల సంఖ్యలో జనాన్ని సమీకరించింది ట్రంపే అన్న అభిప్రాయాన్ని ప్యానల్‌ తన విచారణలో వ్యక్తం చేసింది. ఇక క్యాపిటల్‌ హిల్‌పై దాడికి విద్వేష ప్రసంగంతో అభిమానుల్ని ఊసిగొల్పినట్లు కూడా ప్యానల్‌ విచారణలో వెల్లడైంది. క్యాపిటల్‌ హిల్‌ దాడికి ఆజ్యం పోసింది ట్రంపే అని కమిటీ వైస్‌ చైర్మన్‌ రిపబ్లికన్‌ నేత లిజ్‌ చెనాయ్‌ అన్నారు. క్యాపిటల్‌ హిల్‌ అల్లర్లు అమెరికా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసినట్లు డెమోక్రాట్‌ బెన్నీ థాంప్సన్‌ తెలిపారు. అయితే ఓటమి తట్టుకోలేని ట్రంప్‌ తన మద్దతుదారుల్ని రెచ్చగొట్టినట్లు కమిటీ తెలిపింది. ఏడాది పాటు జరిగిన దర్యాప్తు వివరాలను హౌజ్‌ కమిటీ విచారణలో వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events