Skip to main content

Namaste NRI

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో.. మీట్‌ అండ్‌ గ్రీట్‌

లండన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో అక్కడి తెలుగు ప్రజలు మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ  తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలతో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు, ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగలను నేడు అనేక దేశాలతో నిర్వహించడం మనకెంతో గర్వకారణం అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు మాన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి అని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలోనే గొప్ప పరిపాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక గొప్ప విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలో అనేక అద్బుతాలు చోటు చేసుకున్నాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News