Namaste NRI

న్యూజెర్సీలో ఘనంగా జొన్నవిత్తుల సాహితీ సమావేశం

న్యూజెర్సీ రాష్ట్రంలోని సోమర్‌సెట్‌లో న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) సంయుక్తంగా జూన్‌ 3న ప్రత్యేక సాహితీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా, సాహిత్య రంగాలలో విశిష్ట కృషి చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోన్నవిత్తుల మాట్లాడుతూ చిన్నతనం నుంచి తనకు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేదని తెలిపారు. అందువల్ల పద్యాలు, పాటలు రాస్తూ వుండేవాడినని పేర్కొన్నారు. ఇప్పటికి 24వ శతకాలు రాసినట్లు తెలిపి వాటి గురించి వివరించారు. ఇంతమంది తెలుగు భాషాభిమానులు ఈ సాహితీ సమావేశం ఏర్పాటు చేయటం ఒక గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. తాను రచించిన శతకాలలోని అనేక పద్యాలను జొన్నవిత్తుల శ్రావ్యంగా పాడి వినిపించారు. దీంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది.

                 తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు రాచకుళ్ల మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలను చేపట్టిన తమ కార్యవర్గం తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. కార్యదర్శి రవి కృష్ణ అన్నదానం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గాన్ని సభికులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో నాట్స్‌ ప్రతినిధులు, శ్యాం నాళం, శ్రీహరి  మందాటి, రవి కృష్ణ, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్ర శేఖర్‌ కొణిదెల, శేషగిరి కంభంపాటి, రమేష్‌ బేతంపూడి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవంతానికి కృషి చేసిన వాలంటీర్లు రవి శంకర్‌ అప్పన, శ్రీని తోడుపునూరి, మోహన్‌ ములే, సత్య నేమాన తదితరులతో పాటు ఇందిరా రెడ్డి, శ్రీరామ్‌ కొల్లూరి, రవి కృష్ణ, శ్రీదేవి జాగర్లమూడి, జనని కృష్ణ,  ఆనంద్‌ పాలూరి, సుధాకర్‌ ఉప్పల, శరత్‌ వేట, ధనలక్ష్మి రాచకుళ్ళ తదితరులకు తెలుగు కళా సమితి కార్యవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.  ఈ  సమావేశంలో పలువురు సాహితీ ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events