కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సమ్మతమే. ఈ చిత్ర ట్రైలర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. థియేటర్లలో సినిమా చూసి ఆనందించండి. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారందరూ సమ్మతమే అంటారు. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరిని మెప్పిస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ గీతా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు. కేటీఆర్‌గారు ట్రైలర్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, మాలాంటి కొత్తవాళ్లు సినిమాల్లో రాణించాలని కేటీఆర్ మాట్లాడటం మాకెంతో స్ఫూర్తినిచ్చింది అన్నారు. ఈ సినిమా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నాం అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. ఈ చిత్రాని కంకణాల ప్రవీణ్ నిర్మించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సంగీతం : శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సతీష్‌రెడ్డి మాసం.














