Skip to main content

Namaste NRI

ఆ వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావు: అమెరికా

భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేతలు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని అమెరికా స్పష్టం చేసింది.  ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రెస్‌ తెలిపారు.  ఈ వ్యాఖ్యలను బీజేపీ కూడా బహిరంగంగా ఖండిరచడం తమ దృష్టికి వచ్చిందని, మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్‌కు సలహా ఇస్తున్నాం అని అమెరికా తెలిపింది.  మత స్వేచ్ఛ, మానవ హక్కుల ఆందోళన అంశాలపై భారత ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతుంటామని తెలిపారు.

Social Share Spread Message

Latest News