కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం కొండా. త్రిగుణ్, ఇర్రామోర్ జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ కొండా మురళికి ఏ కష్టం ఉందని అనుకుంటారని, ముంబై మాఫియా, విజయవాడ రౌడీలను వర్మ చూశారని, మాజీ పోలీసులు, నక్సలైట్లను కలిసి తర్వాత తెలంగానలో ఇంత కష్టపడిన మనిషి ఉంటాడా? అని నా జీవితాన్ని సినిమాగా తీస్తానని చెప్పారన్నారు. 30 ఏళ్ల క్రితం నాకు పోలీసులు 50 శాతం, నక్సలైట్లు 50 శాతం సాయం చేశారని అన్నారు. నా జీవితంలో ఆర్జీవిని మర్చిపోను ఆన్నారు. నా పాత్రలో త్రిగుణ్ బాగా నటించారన్నారు. రామ్గోల్ వర్మ మాట్లాడుతూ కొండా మురళి, కొండా సురేఖల జీవితాల్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా తెరకెక్కించా. సురేఖ మాటల్లో చూపిస్తే మురళి చేతల్లో చూపిస్తారు. రెండు ముఖ్యమే. వారి పాత్రల్లో త్రిగుణ్, ఇర్రామోర్ చాలా బాగా నటించారు. ప్రధాన ప్రతినాయకుడిగా నటించిన అభిలాష్ని మరిన్ని సినిమాల్లో చూడనున్నాం అన్నారు. త్రిగుణ్ మాట్లాడుతూ వరంగల్లో కొండా అనేది పేరు కాదు, ఓ భావోద్వేగం. సినిమాలో ఆ భావోద్వేగాన్ని పండిరచే అవకాశం నాకు లభించింది అన్నారు. మన కథలు మనం చెప్పే రోజులొచ్చాయని, కొండా దంపతుల ఉద్యమ ప్రయాణంలో ఈ సినిమా తెరకెక్కిందన్నారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుస్మితా పటేల్. రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా సుస్మితా పటేల్ నిర్మాత. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ కార్యక్రమంలో కొండా మురళి, కొండా సురేఖ, సుచితా చంద్రబోస్, అభిలాష్, పార్వతి, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.














