శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రిన్స్. మరియా ర్యాబోషప్క నాయికగా నటిస్తున్నది. సత్యరాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. చిత్ర రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. దీపావళి పండక్కి సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక వీడియోను రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్లతో పాటు సత్యరాజ్, దర్శకుడు అనుదీప్ ఈ సినిమా విడుదల తేదీ విశేషాలను ఈ వీడియలో పంచుకున్నారు. దర్శకుడు అనుదీప్ కేవీ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: : తమన్, సమర్పణ: సోనాలి నారంగ్, రచన, దర్శకత్వం: అనుదీప్ కేవీ, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస.














