Namaste NRI

వారసుడు వచ్చాడు

స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రానికి వారసుడు అనే టైటిల్‌ను ఖారారు చేశారు. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది. విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. సూట్‌లో క్లాస్‌ లుక్‌తో ఉన్న విజయ్‌ స్టిల్‌ ఆకట్టుకుంటున్నది. ద బాస్‌ రిటర్న్స్‌ అనే క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకొంటున్నది సినిమా. ప్రస్తుతం చెన్నైలో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. శరత్‌కుమార్‌, ప్రభు, ప్రకాష్‌ రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ, శ్యామ్‌, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ పతాకాలపై దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. హర్షిత్‌ రెడ్డి, హన్షిత సహ నిర్మితలు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ పళని,  కూర్పు: కె.ఎల్‌.ప్రవీణ్‌, కథ స్క్రీన్‌ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌, మాటలు: వివేక్‌, సంగీతం : ఎస్‌ థమన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events