Namaste NRI

మాస్‌ అవతారంలో వైష్ణవ్‌ తేజ్‌

వైష్టవ్‌ తేజ్‌ హీరోగా ఓ కొత్త  చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌.నాగశంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కునున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు సుధీర్‌వర్మ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ క్లాప్‌ ఇచ్చారు.  చిత్ర ముహూర్తం సందర్భంగా ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.  ఎస్‌. నాగవంశీ స్క్రిప్ట్‌ను శ్రీకాంత్‌కు అందించారు.  వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త మాస్‌ లుక్‌లో కనిపిస్తారు. 2023 సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తాం అన్నారు చిత్ర నిర్మాతలు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు కల్యాణ్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events