శ్రీలంకలో ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో ఆ దేశం సతమతం ఆవుతోంది. అయితే అంతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని పార్లమెంట్ సాక్షిగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే తెలిపారు. ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో దేశం పూర్తి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని అన్నారు. దేశం చాలా కిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని తెలిపారు. పెట్రోలియం కార్పొరేషన్ భారీ అప్పుల్లో కూరుకుపోయిందని, దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందని అన్నారు. సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. పరిస్థితి మరింత దిగరాజే అవకాశం ఉందని అన్నారు. పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ప్రపంచంలోని ఏ దేశం కానీ, ఏ సంస్థ కానీ శ్రీలంకకు ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేదని ఆయన తెలిపారు.














