నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా కార్తికేయ 2. అనుపమా పరమేశ్వన్ నాయికగా నటిస్తున్నది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా జూలై 22న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర మొదటి ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చందు మొండేటి మాట్లాడుతూ కార్తికేయ సినిమాను మించిన అంశాలు కార్తికేయ 2లో ఉన్నాయి. ఈ మూవీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది అన్నారు. నా కెరీర్లో కార్తీకేయ 2 సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అన్నారు అనుపమా పరమేశ్వరన్. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: కాలభైరవ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని.














