సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం వెయ్ దరువెయ్. నవీన్‌రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి యువ హీరో శర్వానంద్ క్లాప్‌నివ్వగా, అల్లరి నరేష్ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి విశ్వక్‌సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ఈ టైటిల్‌లోనే మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. లవ్, యాక్షన్ ప్రధానంగా సాగే ఎమోషనల్ డ్రామా ఇది అన్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నాం. పలువురు సీనియర్ నటీనటులు భాగం కావడం ఆనందంగా ఉంది అని దర్శకుడు తెలిపారు. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేయబోతున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్, సిసిరోలియో, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కార్తీక్, దర్శకత్వం: నవీన్ రెడ్డి. ఈ సినిమాలో నటిస్తున్న కాశీ విశ్యనాథ్‌తో పాటు కథానాయకుడు ఆకాష్ పూరి, నిర్మాత కోడీ దివ్య దీప్తి తదితరులు ఈ వేడుకకి హాజరయ్యారు.














