Skip to main content

Namaste NRI

పక్కా కమర్షియల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్‌. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌  జీఏ2 పిక్చర్స్‌ సంంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా   ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము ఎంత కష్టపడి సినిమా చేసినా చివరకు కోరుకునేది డబ్బు కాదు ప్రేక్షకుల చప్పట్లు, ప్రోత్సహమే అన్నారు.  గోపిచంద్‌ విలక్షణమైన చిత్రాలు చేస్తుంటారు. ఈ సినిమా అతనికి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. వినోదం, సెంటిమెంట్‌, సందేశం కలిసి సినిమా చేస్తూ మారుతి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ బాగుంది, సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్మకం కలుగుతోంది అన్నారు.

                పట్టుదలతో ఇండస్ట్రీలో ఎదిగారు చిరంజీవి అని గోపీచంద్‌ అన్నారు. ఆయన మాలాంటి ఎందరికో స్ఫూర్తినిస్తారు. తనకున్న టాలెంట్‌కు దర్శకుడు మారుతి ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటాడు. రాశీ ఖన్నా ఈ చిత్రంలో తన కెరీర్‌ బెస్ట్‌ క్యారెక్టర్‌ చేసింది. మారుతి, బన్నీవాసు, యువీ వంశీ వీళ్ల చేతులో సినిమా చేరితే సగం విజయం సాధించినట్లే. ఈ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌ రాజు, నటి శ్రియా, నటుడు రావు రమేష్‌, నిర్మాత ఎస్కేఎస్‌, బన్నీ వాసు,  సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి,  వైవా హర్ష, పవన్‌ సాదినేని, పవన్‌, కౌశిక్‌, సుబ్బు, అజయ్‌ ఘోష్‌, జానీ, వివేక్‌ కూచిబొట్ల, కృష్ణ కాంత్‌, ఎస్‌.కె.ఎన్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News