సుధాకర్ రెడ్డి, కీర్తిలత, అభిరామ్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం భీమ దేవరపల్లి బ్రాంచి. రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఏబీ సినిమాస్, నిహల్ ప్రొడక్షన్స్‌పై బత్తిని కీర్తి లత గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్య చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కిస్తున్నాం. ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. దాని ఆధారంగానే ఇప్పుడీ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: రాజ నరేంద్ర చెట్టపెల్లి, సంగీతం: చరణ్ అర్జున్, ఛాయాగ్రహణం: చిట్టిబాబు.














