Skip to main content

Namaste NRI

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ చెక్‌ రిపబ్లిక్‌ శాఖ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్‌ పర్యటనలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల చెక్‌ రిపబ్లిక్‌లో ఎన్నారైలతో సమావేశం అయ్యారు. 52వ ఎన్నారై టీఆర్‌ఎస్‌ చెక్‌ రిపబ్లికన్‌ శాఖను ప్రారంభించారు.  ఈ సందర్భంగా మహేష్‌ బిగాల  మాట్లాడుతూ ఇది టీఆర్‌ఎస్‌ పార్టీకి 52వ ఎన్నారై శాఖ అని  ఆయన పేర్కొన్నారు. మిగతా యూరప్‌ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష స్పందన లభించిందన్నారు.  ఏ ఎన్నారైని అడిగినా కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారని ఆయన తెలిపారు. మోదీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు ఆర్థిక సాయం చేయక పోగా చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, చెన్నై, కర్నాటక, ఢల్లీి ఎన్నారైలు రాఘవరెడ్డి లోకసాని, ఆదిత్య, రవీంద్ర బాబు అరుణ్‌, శ్రీనాథ్‌, ప్రశాంత్‌, అభినవ్‌, బీరేన్‌, పావని, ప్రేమ్‌, శిరీష్‌, జై ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News