Skip to main content

Namaste NRI

డీఆర్డీవో మరో ఘనత

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్డీవో) మరో ఘనత సాధించింది. అటానమస్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్‌ తొలి విమానం విజయవంతమైంది. ఈ తొలి విమానాన్ని డీఆర్డీవో కర్ణాటకలోని చిత్రదుర్గ్‌ ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌  విజయవంతంగా పరీక్షించింది. ఇది మానవ రహిత గగనతల విమానం (యూఏవీ), ఇందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో తెలిపింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా ఇది ఒక ముఖ్యమైన దశ అని డీఆర్డీవో పేర్కొంది.  డీఆర్డీవో పరిశోధనా ప్రయోగశాల‌ల్లో ఒకటైన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) రూపొందించింది. ఏడీఈ శాస్త్ర‌వేత్త‌లు దీన్ని అభివృద్ధి చేశారు.  ఈ యూఏవీ ఒక చిన్న టర్బోఫ్యాన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా తనంతట తాను పని చేస్తుంది. టేకాఫ్ నుంచి వే పాయింట్‌ నేవిగేషన్, ల్యాండింగ్ వ‌ర‌కు క‌చ్చిత‌మైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించింద‌ని డీఆర్డీవో తెలిపింది. దీంతో మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా డీఆర్డీవో గొప్ప విజయం సాధించింది.

Social Share Spread Message

Latest News