అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహా సభలు వాషింగ్టన్ డీసీ వేదికగా జులై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరుగుతున్నాయి. ఆటా మహాసభల్లో తెలుగు యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. పెండ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే వారిని ఈ మేట్రిమోనియల్ వేదికపై తీసుకెళ్లి వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకునేందుకు అవకాశాన్ని నిర్వాహకులు కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అనిత ముతోజు చైర్మన్ వ్యవహరిస్తున్నారు. సాయి వల్లూరిపల్లి, సుదర్శన్ రెడ్డి అరువ, కోటిరెడ్డి కో చైర్మన్లుగా ఉన్నారు.














