తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరుకావడంతో పాటు దేశ్ కా నేత కేసీఆర్ అంటూ ఎన్నారైలు నినదించారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరీ, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ అతిథులుగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా ముగ్ధులను చేసింది. ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్ మల్చేలం వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషధారణ ధరించి బోనాల ఊరేగింపుకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమన రెడ్డి, సత్య చిలుముల, , అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి,ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్ దూసరి,ఉదయ్ నాగరాజు,అధికార ప్రతినిధి హరిగౌడ్, సభ్యులు, పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృథ్వీ, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నిఖిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, లడ్డు, స్రవంతి, జాహ్నవి, వెంకట్రెడ్డి, వంశీ, రవి పులుసు, మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, రాజేష్ వర్మ, తదితరులు ఉన్నారు.




























