Namaste NRI

ఘనంగా ముగిసిన ఆటా వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భారత్‌కు చెందిన ప్రముఖులతో పాటు తెలుగు వారు భారీగా పాల్గొన్నారు. 140 మందికి పైగా పాల్గొన్న తెలుగు మన వెలుగు కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సభలకు మగ్దూం సయ్యద్‌, రవి రాక్లే, సింగర్‌ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శివమణి, థమన్‌ మ్యూజికల్‌ నైట్‌ శ్రోతలను ఉర్రుతలూగించింది. డ్రమ్స్‌ పైన శివమణి చేసిన విన్యాసం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. బతుకమ్మ పైనా ఆటా ముంద్రించిన పుస్తకాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బుజాల మాట్లాడుతూ ఆటా కార్యవర్గం తనపై ఉంచిన గురుతర బాధ్యతలను ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ మహా సభలు నిర్వహించటానికి తోడ్పాటు అందించిన కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కో ఆర్డినేటర్‌ కిరణ్‌ పాశం తదితరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోర్‌ కమిటీ, ఆడ్‌ హాక్‌ కమిటీ, కాట్స్‌ టీం, వాలంటీర్స్‌ విశేష కృషి మూలంగానే ఘనంగా నిర్వహించగలిగామని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ ఆటా వేడుక‌ల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్, గ్యాద‌రి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events