Skip to main content

Namaste NRI

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలలకం రేపాయి. జపాన్‌ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా అబే ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో షింజో వేధికపై కుప్పకూలిపోయారు. ఇప్పటి వరకు అందించిన సమాచారం మేరకు ఆయన తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దుండగుడు తుపాకీతో అబేపై రెండురౌండ్లు కాల్పులు జరిపారని, ఆయనకు తీవ్ర రక్తస్త్రావం అయిందని తెలిసింది. హుటాహుటిన అబేను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అపస్మారక స్థితిలో వెళ్లారని, ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్‌ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే రికార్డు సృష్టించారు.

Social Share Spread Message

Latest News