Skip to main content

Namaste NRI

ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే అరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రధాని ఫుమియా కిషిదా తెలిపారు. అబే ప్రాణాలతో బ్రతికి రావాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటనను ప్రధాని కిషిదా ఖండిరచారు. షింజోపై అటాక్‌ క్షమించరానిదని తెలిపారు. అబే ప్రాణాలను దక్కించుకునేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడి ఘటన హేయమైనందని, ఏ మాత్రం సహించబోమన్నారు. ఎన్నికలు జరగబోయే వేళ ఈ దాడి జరిగిందని, ఇది ప్రజాస్వామంపై దాడి అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులందరూ టోక్యో చేరుకోవాలని ఆదేశించారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ను మారుస్తారా లేదో తెలియదు.

Social Share Spread Message

Latest News