కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ది ఘోస్ట్. ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా సినిమా మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 9న కిల్లింగ్ మెషీన్ పేరుతో తొలి విజువల్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త లుక్‌ను నెట్టింట పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో నాగార్జున కత్తితో శత్రువుల్ని వేటాడుతూ ఆసక్తికరంగా కనిపించారు. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో నాగ్, సోనాల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో దాన్ని పూర్తి చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: భరత్, సౌరభ్, యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ, ఛాయాగ్రహణం: జి.ముఖేష్. దర్శకత్వం: ప్రవీన్ సత్తారు.














