జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాయుధుడైన దుండుగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శాయక్తుల ప్రయత్నించారని జపాన్ ప్రధాని ప్రకటించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి పోవడంతో ఆయన్ని కాపాడడం వీలు కాలేదని అధికారులు ప్రకటించారు. ఓ సభవలో ఆయన ప్రసంగిస్తుండగా దుండుగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షింజోను కాపాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.














