Skip to main content

Namaste NRI

 అమర్‌నాథ్‌ యాత్రలో మళ్లీ విషాదం.. వరదల్లో 

జమ్ముకశ్మీర్‌ అమర్‌నాథ్‌ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. భోలేనాథ్‌ గుహ సమీపంలోనే మొదలైంది కుంభవృష్టి. ఆకస్మిక వదర ఉధృతికి యాత్రికుల టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయి. పలువురు వరదల్లో కొట్టుకుపోగా పంది మృతి చెందినట్లు సమచారం. అయితే చాలా మంది కనిపించకుండా పోవడంతో వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు. గత నెల 30న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది.

Social Share Spread Message

Latest News