సాక్షి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ద్రౌపది. రాజేంద్ర, దేవిశ్రీ, శ్రావణ భార్గవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ వాణిజ్య విలువలతో కూడిన మహిళా ప్రధాన చిత్రమిది. ద్వాపర యుగంలో ద్రౌపది గురించి మనకు తెలుసు. కలియుగంలో ఒక స్త్రీ ద్రౌపదిగా ఎలా మారింది? ఆమె అలా మారటానికి ప్రేరేపించిన పరిస్థితి ఏంటి? అనేది ఈ చిత్ర కథాశం మంచి సందేశం ఉంటుంది. ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి. అలాగే యూత్కి కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయనున్నాం. జగిత్యాల, హైదరాబాద్, పోచంపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. చిత్రీకరణ పూర్తయింది. రామోజీ ఫిలిం సీటీలో పాటలు చిత్రీకరించాం. సెప్టెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. బొడ్డుపల్లి బ్రహ్మాచార్య నిర్మాణంలో దర్శకుడు రామ్ కుమార్ రూపొందిస్తున్నారు. ఎడిటర్ : వి నాగిరెడ్డి, సంగీతం: జయసూర్య.




























