మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రధారులు. లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ను ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబు విడుదల చేశారు. చోళుల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఎ. ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. టీజర్లో దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం అంతా దాన్ని మరిచిపోవడానికే.. ఆమెని మరచిపోవడానికే..నన్ను నేను మరిచిపోవడానికి అనే సంభాషణలు టీజర్లో వినిపించాయి. తెలుగులో తనికెళ్ల భరణి మాటాలు రచించారు. 10వ శతాబ్దంలో చోళ రాజుల మధ్య పవర్ స్ట్రగుల్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అనంత్ శ్రీరామ్ గీతరచన చేశారు. రవివర్మన్ ఛాయాగ్రాహకుడు. మణిరత్నం ప్యాషన్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.




























